ఉత్పలిని 📝   (ఉత్పలిని📝)
398 Followers · 552 Following

read more
Joined 2 July 2020


read more
Joined 2 July 2020

నేనెంత బాగున్నాను...!
మనసును ఎటో ఎగురవేసి
దారంతా శూన్య కథలు మోసుకొచ్చాను
కనులను పువ్వులపై ఆరవేసి
క్షణికానంద భ్రమలలోకి జారుకున్నాను

నేనెంత బాగున్నాను...!
నా నీడలను చక్కగా చిత్రించాను
ఎద మేడలోని నక్షత్రాలను
హాయిగా హింసించాను
చెవులు బాగా వినబడుతున్నాయి
నా ఏకాగ్రత ఇచ్చే బదులును
తీసుకోవాలని ఎవ్వరికీ ఆశ లేదు

నేనెంత బాగున్నాను...!
పాపం పలుమార్లు నన్ను పఠించినా
ఈ లోకానికి ఇంకో దిశలో
అప్రయత్నంగా పయనిస్తున్నాను
చుట్టూరా తిరుగుతూ చందమామ
పక్కకు నెట్టేసి నా ముసుగులో
నేను మళ్ళీ దాక్కున్నాను

నేనెంత బాగున్నాను...!
నీ ధ్యాసా నిప్పులపై రాజుకుంటూ
పరోక్షంగా పరావర్తించాను
నా జీవన కడలిలో కొత్త కలతకు
ప్రేమ అలలతో స్వాగతించాను
-ఉత్పలిని📝

-



నువ్వు లేని లోటును అలాగే ఉంచేశాను
కల్తీ చేసే కథలను రాయడం ఎప్పుడో ఆపేశాను
పలకరించే నీ పెదవులు లేవని తెలిసు కదా
న్యాయంగా నా మనసుకు నేనే శిక్ష వేసుకున్నాను
ఇప్పుడైతే కన్నీటి కలతలే పాడుతున్నాను
కొన్ని రోజులకి పన్నీటి వ్యధలను వాటేసుకుంటాను
తీరం...నీ తలపు అని కరిగిపోయే దాన్ని
తీరా... నువ్వు దగ్గరకు వస్తే వెలివేసే మొండిదాన్ని
ఈ స్నేహం స్నేహమే స్నేహమే
ఏ గీత దాటినా మన కథ మోసమే

-



అంత సులభం కాదు కదా..!
👇

-



An Empty Soul...🤗👇

-



అతడికి దూరమైన ప్రతీసారి
ఆమె ప్రేమను సంద్రానికి అప్పగిస్తాదట
ఆ అలలు ఎగసి ఎగసి చివరకు
ఆమె పాదాలనే చేరుతాయని
బాగా తెలుసట
ఈ అలలు ఎగసిపడే సమయాన
అతడి ఆనవాళ్ళు మదికి చేరుతాయట
కొత్త కలువలా విరబూయాలని
అతడి వెన్నెల వాగ్ధానానికి
ఎదురుచూస్తూ ఉండిపోతాదట..!

-



నా తప్పు లేకుండా అతడికి
సంజాయిషీ ఇచ్చేకన్నా చివరి శ్వాసను
వదిలేయడమే మేలు అనిపించి,
అతడిని శాశ్వతంగా వదిలేశాను.

-



స్త్రీ స్వేచ్ఛలు వెలిసాయండోయ్
మా వరండా నిండుగా
తారలు మెరిసాయండోయ్
దెబ్బనోర్చలేక భర్త కళ్ళు విరిగాయంతే

స్త్రీ స్వేచ్ఛలు వెలిసాయండోయ్
మొన్న ఊరెళ్ళి ఈ రోజే తిరిగొచ్చిన
ఉత్తమలేఖ విడాకుల పత్రమంటండోయ్
రెండు సిరా చుక్కలతో రెక్కలొస్తాయంతే

స్త్రీ స్వేచ్ఛలు వెలిసాయండోయ్
గొంతెత్తిన మృగానికికు సంకెళ్ళు వేయించి
అట్లకర్ర వాతలు అత్తింటికి విడిదిచ్చిందండోయ్
ఆత్మస్థైర్యం ఆడదయిన ఆనవాలంతే

స్త్రీ స్వేచ్ఛలు వెలిసాయండోయ్
రాళ్ళపై రంగులు వేయడం మానేసి
మూర్ఖత్వ గీతల నుంచి బయటపడిందోయ్
నుదుట సింధూరం దూరమయ్యిందంతే

స్త్రీ స్వేచ్ఛలు వెలిసాయండోయ్
అక్షరాలను అక్కున చేర్చుకొని
బానిస కోడలు కొడవలయ్యిందండోయ్
ఆత్మాభిమానం అగ్నికీలలౌతాదంతే

-



జానకి విముక్తిలో సత్యం మాటలు తీర్పులా ఉంటాయి

అప్సరసలా వున్న అమ్మాయి అయినా సరే,
వ్రతాలూ నోములూ నోచిందంటే, ఇక
ఆ అమ్మాయిలో నా కేమీ అందం కనపడదు.
ఎటు చూసినా ఆ మూర్ఖత్వమే కనపడుతుంది.
బియ్యేలూ,ఎమ్మేలూ చదివిన అమ్మాయిలు కూడా
నెలకి మూడేసి రోజులు బయట కూర్చుంటారు.
నువ్వు ఇక్కడ గతి లేక చేస్తు న్నావుగానీ,
కొందరైతే ఎంత చదువుకున్నా, పుట్టిళ్ళల్లో వున్నా,
అమ్మలో అమ్మమ్మలో చెప్పారు కదా అని,
ఏమీ వ్యతిరేకించకుండా ఇష్టంగానే కూర్చుంటారు.

"అంత చిన్న విషయాల్లో కూడా
స్వతంత్రాలోచన లేని మూర్ఖుల్లో
ఏం అందం కనబడుతుంది?"

-



నిన్నెట్టా పట్టుకోవాలో
నిన్నెట్టా కట్టుకోవాలో
మన్ను మోసిన మిన్ను కాసిన
కలల కౌగిలి కొమ్మల నడుమ
గిరికీలు కొట్టినాను
మురిపాలు మెట్టినాను
హృదయ నివేదనను నినాదాలు చేసి
పెదవి నిండుగా నీ ప్రేమను ఒత్తినాను

-



ఇదో కథనం ...👇


-


Fetching ఉత్పలిని 📝 Quotes