QUOTES ON #ఊహా

#ఊహా quotes

Trending | Latest
9 JUL 2020 AT 0:15

ఊహ ఊహగానే మిగిలే
ముగియని కథ కంచికే చేరే
కథకి అదే కొసమెరుపాయే!

-


28 MAY 2017 AT 9:19

నా
ఆరంభమూ శ్వాసతో,

నా
అంతమూ శ్వాసతో,

నా
ఆరంభపు శ్వాస నాడు
ఎవరూ ఊహించి ఉండరు
నా ఊపిరి నువ్వవుతావనీ,
నా అంతిమ శ్వాస నీ చెంతనే అనీ.....

-


18 JUL 2020 AT 19:29

ఈ ఇలలోనే చూడచక్కనైన జంటట వారిది
చక్కనైన చలనచిత్రంలోని చూడముచ్చటైన జంటట వీరిది
అబ్బురపడే అందమైన జంటట ఇంకొకరిది
ఆశ్చర్యపడేలా చేసే మా మంచి జంటట వేరొకరిది
ఏమిటో ఏమో అలా కన్పించే ఏ జంటని చూసినా
మన జంటనే నా మనసూహిస్తోంది
నిజమేదైనా ఈ ఊహే చాలా బాగుంది ప్రియతమా!

-


8 JUN 2021 AT 15:21

కనుల భాషకు కొలమానం లేదు...
మనసు భాషకు మొదలే లేదు...
ఊహల గుసగుసలకు గమ్యం లేదు...
తనువుల తహతలకు తాళం లేదు...!

-


17 AUG 2021 AT 16:39

వీడి పోకుండా
వెంటే ఉంటుంది..
అందకుండా
ఊరిస్తుంటుంది..


నా నీడలా
ఆమె ఊహా

-


3 DEC 2019 AT 22:20

దోసిలి నీళ్ళల్లో ఆకాశాన్ని బంధించాననుకొన్నాను కానీ అది వ్రేళ్ల సందుల్లో నుండి ఎపుడు జారెళ్ళిపోయిందో తెలీదు

-


31 AUG 2020 AT 20:46

నా Quote's కేవలం..
ఊహతో నిండిన కల్పితాలు మాత్రమే !!

-


27 MAR 2018 AT 18:50

ప్రియా,
ఎందుకు నేను ఇంతలా ఊహించుకుంటాను?
నేనే ఒక ఊహా చిత్రం గా మారాన లేక నువ్వే నా ఊహా చిత్రం అయి నాతో స్నేహం చేయడం మొదలు పెట్టావా? ఒకవేళ నా ఊహలకు మాటలొస్తే అవి నన్ను అడిగే చివరి ప్రశ్న, నేను చెప్పే మొదటి సమాధానం "నీ గురించే".

-


27 MAY 2017 AT 22:58

ఏకాంతంలో నీ ఊహాలతో గడుపుతాను,
నిజంగా నా తోడైతే నీలో ఒక సగమై,
ఊపిరినై జీవిస్తాను...

-


23 JUN 2019 AT 8:43

ఆశ....

-