30 MAR AT 21:04

ఆవేశం కాదు ఆర్ష సంస్కృతి
ఆక్రమణం కాదు ఆర్ష సంస్కృతి
శాంతి త్యాగ మేది లేని వట్టి
కాషాయం కాదు ఆర్ష సంస్కృతి
30/03/2024

-


26 NOV 2023 AT 21:49

లేదు మందూ ముక్క
బరిని గెలుచుట పక్క
జై జై బర్రెలక్క
ఓ కూనలమ్మ.!
26/11/2023

-


6 NOV 2023 AT 11:59

మట్టిలోంచి మెళ్ళిగా
తల ఎత్తి చూసిన
చిట్టి మొలక
నేలంతా విస్తరిస్తుంది


శూన్యం నుంచే
పూర్ణానికి ప్రస్తానం
06/11/2023

-


19 SEP 2023 AT 14:12

మతాలేవో ఖండించుట కామన కాదు
గురువులనే ఓడించుట యోచన కాదు
సత్యానికి పీఠ వేయు శంకర యతికి
అధర్మాలు ఎప్పుడు ఆమోదన కాదు
19/09/2023

-


18 SEP 2023 AT 18:58

ఎలుకపై ఎక్కిండు
శివాణిని మొక్కిండు
గణా(ధి)పతి అయ్యిండు
ఓ కూనలమ్మ
18/09/2023

-


31 AUG 2023 AT 14:41

నీ చేతికి రాఖీ ఒక దారం కాదు
ఇరు గుండెలు కలుపుటకది దూరం కాదు
బ్రతుకంతా బాసటై ఉంటానని పలుకు..
సోదరులకు తోబుట్టువు భారం కాదు
31/08/2023

-


25 AUG 2023 AT 16:14

1
చెరువు పక్కన నెలవు
పక్క దేశపు కొలువు
వద్దురన్నా వినవు
ఓ కూనలమ్మ.!
2
పల్లమెరుగును వాగు
ఎదురుకెక్కును నాగు
చూసి పథమున సాగు
ఓ కూనలమ్మ.!
3
కురిసి పోయిన చినుకు
కలిసి తెచ్చెను వణుకు
వెరసి వచ్చెను కునుకు
ఓ కూనలమ్మ.! 3
27/07/2023

-


31 JUL 2023 AT 8:41

ఏ పార్టిని దూషించని నాయకుడెక్కడ చూపించు
ఏ హామీ ప్రకటించిని ప్రేరకుడెక్కడ చూపించు
ఏదేమైనా అందరి లక్ష్యం ఒకటే అధికారం..
అప్పుల కుప్పలు పెంచని పాలకుడెక్కడ చూపించు
31/07/2023

-


8 JUL 2023 AT 19:57


విరిసింది హరివిల్లు
కురిసింది చిరుజల్లు
కష్టజీవి తోటంతా..
నిండింది సిరిజల్లు

-


6 MAY 2023 AT 2:06

ఎడారైన గుండెలపై
అలసిన తడి కన్నులపై
జాలి లేని మేఘమా..
కురవ రాకు పంటలపై
06/05/2023

-


Fetching Naresh Reddy Aleti Quotes