Rajani Siripuram   (Rajani Reddy)
251 Followers · 107 Following

read more
Joined 5 June 2020


read more
Joined 5 June 2020
7 HOURS AGO

నీ ఆలోచనే నాకు అందమైన వరం కదా
నీ జ్ఞాపకాలను తలువని క్షణమైనా ఉందా

నువ్వే నాకు ప్రపంచం
నీ ప్రపంచం ఏదైనా నాకు సమ్మతమే...

నువ్వు నాతో ఉన్న క్షణమైనా
లేని ఒంటరితనమైనా
నాకు నీ తలపులే తోడు నేస్తం...!!

-


8 HOURS AGO

ఇద్దరు మనుషులు ఒకేసారి మత్తులో పడితే అది ప్రేమ...అంటా
ఎవరు ముందు స్పృహ లోకి వస్తే వాళ్ళు చెప్తారు ప్రేమకి టాటా...అవునంటా
మొత్తంగా ప్రేమంటే అదంటా..
విన్నారా...వింటున్నారా... ఏంటా..!???

-


8 HOURS AGO

షట్ యువర్ మౌత్...✍️
(అయ్యో రామా...నేను తిట్టట్లేదు !!)

-


16 HOURS AGO

మనసుతో ముడిపడిన బంధాలు
ఎప్పటికీ తెగిపోవు..
మౌనంగా ఉంటాయి..అంతే...!!?

-


19 HOURS AGO

కడలిలా నువ్వు కదలి వస్తానంటే...
అలలా నిన్ను హత్తుకు ఎత్తుకుపోనా...!!

-


19 HOURS AGO

మన ఆలోచనలు మంచిగా ఉంటే మన చేతలు నమ్మకంగా ఉంటాయి...
మనల్ని ఒకరు నమ్ముతున్నారంటే వాళ్ళ దృష్టిలో మన మంచితనం ఋజువు చేసుకున్నట్టే మరీ..!!

-


20 HOURS AGO

నిజమైన ప్రేమలో " నేనున్నా" అనే మాటతప్ప
ఇంకేముంటుంది...!!?

-


20 HOURS AGO

ఈ ప్రపంచంలో నిజమైన నొప్పేంటో తెలుసా
మన మనసులో ఉన్న వ్యక్తిని మరిచిపోవాలా
లేదంటే మనకేమి కాడంటూ మారిపోవాలో
అర్థం కానీ ఒక అందమైన సందేహము...
రక్తం కనపడని గాయంతో
రాత్రంతా నిద్దురలేని ఆలోచనలతో
పగలంతా ఎదురుచూడటం...!!

-


20 HOURS AGO

గమ్యం కన్నా ప్రయాణం ముఖ్యం
ఎన్నాళ్ళు ఈ మట్టిమీద ఉంటామో ఎరుగం
ఎపుడూ ఏదోక హడావుడి తప్పని జీవితం
మరెందుకు అంతలా చిటపటలాడిస్తూ ఆ ముఖం
కాస్త నవ్వొచ్చు..ఇంకాస్త చిల్ అవొచ్చు కదా నేస్తం
రేపటికి ఉందంటావా చెప్పు రూపం
నిన్నటినీ తీసుకొచ్చేందుకు ఉందా ఏదైనా పరికరం
అందుకే
నేడు సరదాగా నలుగురితో కలిసి బతకడమే ఆరోగ్యం...!!

-


20 HOURS AGO

ఎవర్ని గెలిపించడానికీ
ఎవరు ఓడిపోతున్నారో అర్థమే కావట్లేదు..
అర్ధబలమున్న అవినీతికి పట్టం కట్టేందుకు
ఇన్ని అవస్థలా ఈ ప్రజాస్వామ్యానికి...!??

-


Fetching Rajani Siripuram Quotes