నాలోని కావ్యం   (PAVI...)
12 Followers · 11 Following

Joined 5 March 2020


Joined 5 March 2020

సెక్స్ అనే నిజాన్ని కప్పిపెట్టడానికి
పుట్టిన అబద్ధం ప్రేమ...

-



ఆమె అందాన్ని వర్ణించలంటే జాబిల్లితో కాదు
జాబిల్లినే తనతో పోల్చాలి.
కడలి అలలతో తన కురులని కాదు
తన కురుల అలలతో కడలిని పోల్చాలి.
నెమలి విప్పిన వేయి కళ్ళతో కాదు
కాటుక దిద్దిన తన కళ్ళతో పోల్చాలి.
తేనెటీగలు దాచిన తేనెతో కాదు
తన పెదాల్లో దాగిన మత్తుతో పోల్చాలి.
హంస నడకతో కాదు
తన వలపు సొగసుతో పోల్చాలి.
ఎంత పోల్చిన తను
అందుకోలేని అందమైన గ్రహమే
నేను, నా మది
తన చుట్టూ తిరిగే ఉపగ్రహమే.

-



నా జీవితంలోకి అడుగు పెట్టడానికి
నీకు ఆహ్వానం మాత్రమే ఇవ్వగలను
వెంట పడి వేధించి నీ మనసులో
మూర్కుడిని అవ్వలేను
తిరిగి ప్రేమించే ఉద్దేశం నీలో ఉన్నప్పుడు
నన్ను చేర రా... సంతోషంగా స్వాగతిస్తాను.

-



మనకెవడ్ర ఉద్యోగం లేదు అన్నది.
నా కష్టాలకి నేనే CEO
నా అప్పులకి వాటిని తీర్చడానికి పడే తిప్పలకి
నేనే Managing Director.

-



ఏ పల్లె నుంచి వచ్చిరో పొట్టకూటికై గీ పట్నానికి !
రాత్రి జాబిలమ్మ జోల మరిచిందట తను చేసే కష్టాన్ని చూసి.
వాడిన డొక్కల చూసి సూర్యుడే చేరదీశాడట
మట్టి పాన్పుల మీద మల్లెలు జల్లి.

-



నాటి కథలు దేవుళ్ళుగా, రాక్షసులుగా చిత్రీకరించబడితే
నేటి కథలు హీరోలుగా, విలన్ గా చిత్రీకరించబడుతున్నాయి
ఆ కథలు చరిత్రలో లిఖించబడితే
ఈ కథలు సినిమా హాల్లో ప్రదర్శించబడుతున్నాయి.
కల్పిత కథల కోసం యుద్ధం చేస్తు
వాస్తవా గాధను కల్పిత కథలుగా చూస్తున్నాం.

-



కను మూయని మధ్యతరగతోడి చీకటి గాధ !

కలలైన గొప్పగా కందామంటే
రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా రాదు
తెల్లారితే ఏ అప్పులోడు ఇంటికొస్తాడో అని
ఎదిగిన పిల్లల పెళ్ళి ఎలా చేయాలో అని.

-



కష్టంగా ఉంది నువ్వంటే ఇష్టం అని చెప్పడానికి
ఎక్కడ నువ్వు కష్టం అని చెపుతావో అని.
ఇష్టం అని చెప్పు ఏ కష్టాల్లో అయిన
ఇష్టంగా చూసుకుంటా.

-



నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ
ఆ చందమామనే చూస్తూ సారాయి కాసిందేమో...
ఒళ్ళంత కాంతిని ధరించి, అరుంధతి నయనాలతో మత్తును
వెద జల్లుతూ...
ఏడు వారాల నగలు ధరించిన పున్నమి వెన్నెల కన్న జాబిల్లి లా ఉన్నావు.

-



కోరుకున్న కొద్ది రోజుల్లోనే రాత్రిని ధరించిన ఆ చందమామ
దర్శనమిచ్చింది తను నవ్వుతుంటే నింగిలోని చుక్కలు
నేల జారినట్టు ఎంత అందంగా ఉందో...
తను అలా వెనక్కి తిరిగి నవ్వుతూ వెళ్తుంటే ఈ జన్మకి ఆ నవ్వులు ఎప్పుడు తోడుండలని ఆ దేవతే దిగివచ్చి వరమిచ్చిందేమో అన్నట్లుగా అనిపించింది.

-


Fetching నాలోని కావ్యం Quotes