Mounika Pudari   (లాస్యనరేష్)
1.7k Followers · 81 Following

read more
Joined 20 January 2018


read more
Joined 20 January 2018
20 JAN 2020 AT 19:57

....

-


20 JAN 2020 AT 18:02

....

-


20 JAN 2020 AT 12:53

మాంసపు ముద్దలతో నిండిన యుద్ధభూమిలో
ఎరుపెక్కిన రక్తపు హస్తాలతో నాటిన విత్తు పూవుల్ని పూయిస్తుందా??!!

-


16 JAN 2020 AT 18:29

అక్షరాలని పోగేస్తున్నా ఆలోచిస్తూ...
ఆలోచించడం మాని ఏదైనా కథ రాయడం మొదలుపెట్టమన్నాయి.

-


16 JAN 2020 AT 10:07

జీవితంలో కొన్నిసార్లు కిందపడడం మంచిదే..
ఆ వర్షపు చినుకుల్లా!!
ఆ సంద్రపు కెరటంలా!!
ఇంకొకరికి ఆనందాన్నిస్తూ......

-


13 JAN 2020 AT 19:40

చిట్టి తల్లి/తండ్రి
నీకు
వెలుగు చూపించాలని
వెన్నెల్లో గోరు ముద్దలు తినిపించాలని
నాన్న గుండెలమీద నడవాలని
నా వేలు పట్టుకు తిరగాలని
జీవితంలో సంతోషం నింపావని
ఎన్నో కలలు నీ మీద ఎన్నో ఆశలు
కానీ
దేవుడు పరమ పాపాత్ముడు
వెలుగు చూడకముందే చీకటి నింపాడు
శ్వాస తీసుకోకముందే ఊపిరి ఆపేసాడు
చిట్టి తల్లి/తండ్రి
నీవు రాకముందే జీవితం మొత్తం ఉహించుకున్నా
ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఆగిపోయింది ఊహలు ఉహల్లాగే మిగిలిపోయాయి
నీ జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలం కానీ నీకోసం చూస్తూ చూస్తూ మనసు మాత్రం బరువు
నీకు ఇవే నా శ్రద్ధాంజలులు...

-


13 DEC 2019 AT 20:55

తమ ఆత్మస్థైర్యాన్ని నమ్మకుండా అదృష్టాన్ని మాత్రమే నమ్మేవారే అసలైన దురదృష్టవంతులు.....

-


6 DEC 2019 AT 9:10

నిశ్శబ్ద సంద్రంలో
వేసెను వారు వలలు
భవిష్యత్తుపై ఎన్నో కలలు
భీకర అలలతో వచ్చెను ప్రళయాలు
ఛిద్రమైన ఆశలు
మిగిల్చేను విషాద జ్ఞాపకాలు

-


5 DEC 2019 AT 8:17

స్త్రీ అంటే ఓర్పు, సహనం అనే బానిస సంకెళ్ళు వేసిన ఈ సమాజం
ఒక మృగాడు ఆ స్త్రీ బ్రతుకుని నాశనం చేస్తే ఏం చేసింది??
వాడి కామవాంఛ తీర్చుకోడానికి వయసుబేధం లేకుండా స్త్రీ ని హింసించి చివరికి బ్రతుకే లేకుండా చేస్తే ఏం చేసింది??
సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టి కొవ్వొత్తుల నివాళి అర్పించి మూగబోయింది.
స్త్రీ అంటే ఓర్పు సహనం మాత్రమే కాదు స్త్రీ అంటే పరాశక్తి ప్రతిమ అని ఈ సమాజానికి తెలియచేయాలి.
అమ్ములపొదిలో ఒక మగాడిగా పెంచితే వాడొక మృగాడుగా మారి వావివరసలని మరిచి మరీ తన పశువాంఛ కోసం ఎందరో స్త్రీల మానాల్ని బలిగొంటున్నాడు.
నిస్సహాయత ఆవహించినా కూడా శక్తినంతా కూడపెట్టి ఆదిపరాశక్తిలా వాన్ని వధించు.

-


4 DEC 2019 AT 19:50

నీ వీర్యపు గ్రంధుల సుఖానికి ఒక స్త్రీ మానం కావాలి
నీ పశువాంఛకు ఒక స్త్రీ ప్రాణం కావాలి.

-


Fetching Mounika Pudari Quotes