QUOTES ON #LETTERTOYOU

#lettertoyou quotes

Trending | Latest
3 FEB AT 7:40

లేఖ చెప్పుకోలేని భావాలను అక్షరాలుగా
మార్చుకుంటున్న ప్రపంచం ఎలాంటిదో
చదువుతున్నప్పుడు తెలిసింది
అదినాకు అర్థం కాదు అని,
అందరు మనలా ఉండరు అని,
తెలుసుకోవడం కంటే వదిలేసి
మనం మనదారినపోవడం ఉత్తమం అని
ఊహల కంటే వాస్తవంలో బ్రతకమని
అందరి కోసం నీవు ఉంటావు కాని
నీకోసం నీవు కూడా నిలబడవు
అదే జీవితం ఎవరితోనైనా పంచుకోవడం కంటే
నీకు నీవు రాసుకో

-


21 JAN AT 5:48

ఎందుకు
అవసరంలేదు
అది ముగిసిపోయిన
అధ్యాయము
సమీక్షలు,సందేశాలు
వలన ప్రయోజనం
శూన్యమే కదా

-


19 JAN AT 21:09

నీ నుండి దూరం అయ్యాక
మనసు ముక్కలయ్యే
బ్రతుకు భారమయ్యే ..
నీ కోసం పరిగెత్తిన గుండె ఇకపై
కదలనంటుంది ...
నాలో లేని నన్ను ఎంత వెతికినా
దొరకనంటుంది ..
నిశ్చలమైన మానవ శిలాల మారాను
కన్నిరు ఇంకినా ఎడారి నయనాలతో
మిగిలాను ....!!

-


17 JAN AT 20:31

కన్నీళ్ళతో తడిసిన నా కళ్ళను కాదు....
రక్తంతో తడిసిన నా హృదయాన్ని అడుగు......
నువ్వు లేవనే నిజం నాకు గుర్తుకు వచ్చిన ప్రతి క్షణం
ఎంత నరకయాతన అనుభవిస్తున్నానో.... 😢

-


15 JAN AT 19:46

నేను ఏ వ్యక్తిని కోల్పోలేదు దూరంగా ఉన్నాం
అంతే.
నా గుండెలో తన స్థానం ఎప్పటికీ పదిలం.
ఈ జన్మకు వ్రాయగలను ఎన్ని లేఖలైనా తన
కోసం మాత్రమే.
తన కోసం లేఖ అనీ అనుకోగానే..కొన్ని కోట్ల
భావాలు నా మనసు తరంగాలై ఈ అక్షరాల్లో
జీవ నదిలా మారతాయి.
వ్రాయగలనూ..ఎన్ని లేఖలైన నా బంగారం కోసం
మాత్రమే.
ఆ నా ప్రేమాక్షర భావం తనకు మాత్రమే సొంతం.

-


15 JAN AT 11:43

కాదు
కోలుకోలేని గాయం చేసిన వ్యక్తికి
ప్రేమతో రాసుకొను ప్రేమ లేఖ....
ఔను...
తను గాయం చేసింది మనసుకే...
అందుకే
మనిషిగా తననిప్పటికి
ఇష్టపడుతూనే ఉన్నా..

-


15 JAN AT 8:28

ఒకసారి మనసు పడినాక
కోల్పోవడం అనేదే ఉండదు కదా...
నువ్వే నా శ్వాస... నువ్వే నా ఆశ...
తిరిగి రావాలని నీకు ఉంది...
తిడుతాను అనే భయం కదా...
నాకూ తెలుసు...
నీ ఎదలో చిత్రించిన చిలిపి తలపు నాదే...
నీ ప్రతి కలలో కనిపించే వలపు పిలుపు నాదే..
నీ మాట పెదవి గడప దాటి రానంటు మారాం చేస్తుంటే...
నీ చూపు మాత్రం గాలిపటమై...
గగనతీరంలో... నీ ప్రేమ మంత్రం జపిస్తూ..
నాలో నాకే వినిపించేలా మరల మరల గుర్తుచేస్తుంది....
నువ్వేపుడు నా స్నేహానీవే అంటూ...❤️✍️

-


15 JAN AT 0:46

నీ కనుమరుకు నా జీవితకి శ్యాపం అనిపించింది
నీ ఎడబాటు నన్ను ఒంటరిని చేసింది కానీ
సమయం నన్ను మనిషిగా మార్చింది
కోల్పోయింది వజ్రాన్ని కాదు అని నాకు తెలిసేలా చేసింది

-


14 JAN AT 19:54

కోల్పోకుండా ఉంటే బాగుండేదేమో

-


14 JAN AT 19:40

నిన్నంటు కోల్పోయాక
రాయలేను ఏ లేఖ.
ఎందుకంటే
నీతోనే నా భావాఅక్షరాలు
నన్ను వదిలేసాయి గనుక.
రాయలేను ఏ లేఖ
నన్ను నేను కోల్పోయాక..

-